బిచ్కుంద, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రభుత్వ ఐ.టీ. ఐ. / అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ బిచ్కుందలో ఈ సంవత్సరం నుండి కొత్తగా ప్రారంభిస్తున్న ఆరు ట్రేడ్ లలో అడ్మిషన్ ల భర్తీ అన్ని శాఖల సహకారంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున బిచ్కుంద మండలంలోని ప్రభుత్వ ఐ టి. ఐ. లో నిర్వహిస్తున్న అడ్మిషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బిచ్కుంద చుట్టు ప్రక్కల మండలాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, అన్ని గ్రూప్లో అడ్మిషన్ ప్రక్రియపై ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ నెల 30 వరకు అడ్మిషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో అడ్మిషన్స్ పై టాం టాం చేపట్టని తెలిపారు. అన్ని ట్రేడ్ ల్లో అడ్మిషన్స్ పూర్తి చేసేలా గ్రామాల్లోని పంచాయతీ సెక్రటరీల ద్వారా యువతను గుర్తించి పదవ తరగతి అర్హత, 40 సంవత్సరాల వయసు లోపు గల నిరుద్యోగ యువతను ఈ కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలపై వివరించి అడ్మిషన్ తీసుకునే విధంగా చూడాలని తెలిపారు.
మహిళా సంఘాల సమావేశాలలో వివరించాలని తెలిపారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న భవన పనులను కలెక్టర్ పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రతీ రోజూ పనులకు సంబంధించిన వివరాలు పనుల పురోగతికి సంబంధించిన ఫోటోలను వాట్సాప్ ద్వారా పంపించాలని తెలిపారు. అనంతరం టాటా వారిచే సరఫరా చేయబడిన ఎక్విప్మెంట్ లను పరిశీలించారు.
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ ప్రమోద్ కుమార్, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, ఇంజనీరింగ్ అధికారులు, పాల్గొన్నారు.