కామారెడ్డి, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి నియోజక వర్గ అభివృద్ధికి గాను గతంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి 15 కోట్ల పనులకి ప్రతిపాదనలు పంపగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పంచాయత్ రాజ్ శాఖ ఉత్తర్వులు జారి అయ్యాయి.
మిగితా 20 కోట్ల పనులు కూడా త్వరలోనే మంజూరు చేస్తా అని మాట ఇచ్చిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.