సమాధానాలు ఆర్జీ దారునికి తెలపాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండిరగ్‌ లో ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని, వాటికి సమాధానాలు ఆయా అర్జీదారునికి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. గత వారం వరకు 18,360 అర్జీలు రాగా, వాటిని పరిశీలించి 17,752 అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిష్కరించారని, 608 పెండిరగు ఉన్నాయని తెలిపారు.

ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్‌ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, జడ్పీ సి.ఈ. ఒ. చందర్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

బోధన్‌లో రోడ్డు భద్రతపై బాలికలకు అవగాహన

Print 🖨 PDF 📄 eBook 📱 బోధన్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »