బాన్సువాడ, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను సోమవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ లబ్ధిదారులకు అందజేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి కింద పేదలకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్త ఖర్చుల కోసం ఆదుకోవడం జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, వైస్ చైర్మన్ కొత్తిమీర్ కార్ లక్ష్మణ్, డిసిసి డేలిగేట్ కొట్టం మనోహర్, ఈశ్వర్, మాజీ జడ్పిటిసి పుప్పల శంకర్, కౌన్సిలర్లు మోతిలాల్, హకీమ్, నర్సు గొండ,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.