లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మాక్లూర్‌, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

మాక్లూర్‌ మండలానికి చెందిన లబ్ధిదారులకు మాక్లుర్‌ ఎంపిడివో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు 3500 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేయడం జరిగిందని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులతో నిరుపేదలను ఆదుకుంటామని అన్నారు.

ఓడిపోయిన నాయకులు మాయ మాటలు చెప్పితే నమ్మొద్దని, ప్రజల లబ్ధి కొరకు ఎవరినైనా ఎదిరిస్తానన్నారు. ఐలాపూర్‌ హాస్టల్‌ విద్యార్థుల బాధను అసెంబ్లీలో ప్రశ్నించి 49 లక్షలు మంజూరు చేయించానని, గల్ఫ్‌ బాధితుల గురించి గళ మెత్తానని, నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని, నియోజకవర్గ ప్రజల అభ్యున్నతే తన లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, నవంబరు 22, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »