బాన్సువాడ, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం మాల మహానాడు నాయకులు సబ్ కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీం ఇచ్చిన తీర్పు వల్ల ఎస్సీ ఉప కులాలను విడదీసి రాజకీయ కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టును పక్కదోవ పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందని, ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు ప్రవీణ్ కుమార్, మల్లూరు సాయిలు, మేకల సాయిలు, వినోద్ కుమార్, ప్రశాంత్, మన్నే చిన్న సాయిలు, శివయ్య, నాగభూషణం, జగన్ మోహన్, రవి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.