నారాయణఖేడ్, జూలై 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్హేర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్దిదారులకు, అదేవిదంగా సిర్గాపూర్ మండలంలోని 14 మంది లబ్దిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణి లక్మి చెక్కులను శాసన సభ్యులు భూపాల్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విదంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్మి పథకం తీసుకొచ్చి పేదింటి ఆడపిల్లల కుటుంబాలలో సంతోషాలు నింపుతున్నారని తెలిపారు.
కార్యక్రమంలో జడ్పి కో ఆప్షన్ మెంబర్ అలీ, ఆయా మండలాల ఎంపీపీలు గుర్రపు సుశీల, మహిపల్ రెడ్డి, జడ్పీటీసీలు నర్సింహ రెడ్డి, రాఘవ రెడ్డి, ఆయా మండలాల వైస్ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.