దెబ్బతిన్న పంటలు పరిశీలించిన కిసాన్‌ మోర్చా నాయకులు

మోర్తాడ్‌, జూలై 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో దెబ్బతిన్న వరి పొలాలు, సొయా, పసుపు పంటలను నిజామాబాద్‌ జిల్లా భారతీయ జనతా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ఎకరాకి 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అలాగే స్థానిక మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇప్పటికీ ప్రభావిత ప్రాంతాలను, బాధిత రైతులను సందర్శించకపోవడం దురదృష్టకరమని, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం దీనిపై సమగ్ర సర్వే చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసి నష్టపోయిన రైతులకు తప్పనిసరిగా ఎకరాకు 25 వేల రూపాయల చొప్పున లబ్ధి చేకూర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేస్తుందన్నారు.

అదేవిధంగా తిమ్మాపూర్‌ గ్రామంలో లింగం చెరువు అలుగు దెబ్బతిని గత నాలుగు సంవత్సరాలు కావస్తున్నా సంబంధిత నీటి పారుదల శాఖ గాని, అధికారులు గాని ఎవరూ పట్టించుకోక పోగా ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తి వర్షపు నీరంతా వృథాగా పోతుందని, 30 ఎకరాల వ్యవసాయ క్షేత్రాలను నీళ్లు ముంచెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఘూఢమైన మొద్దు నిద్రలో ఉందని, వీరి చేతగానితనం వల్ల రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఇరిగేషన్‌ సిస్టం పై దృష్టి పెట్టాలని ఇలాంటి అలుగులు తూములు మరమ్మతులు పై దృష్టి పెట్టి ఇక ముందైనా రైతులకు నష్టం లేకుండా చూడాలని బిజెపి డిమాండ్‌ చేస్తుందన్నారు.

కార్యక్రమంలో బీజేపీ మోర్తాడ్‌ మండల అధ్యక్షులు పుప్పాల నరేష్‌, అల్లూరి ముత్యం రెడ్డి, ఎలేటి సాయన్న, మల్లేష్‌ యాదవ్‌, లక్మి నర్సయ్య, మండల ఉపాధ్యక్షులు కుంట శ్రీనివాస్‌ రెడ్డి, మండల కార్యదర్శి భూమేశ్వర్‌ గౌడ్‌, నాయకులు రాజరపు ప్రదీప్‌, కిసాన్‌ మోర్చా నాయకులు కొమ్ముల మోహన్‌, నర్సాగౌడ్‌, కొమ్ముల శేఖర్‌ రెడ్డి, సంతోష్‌, బద్దం అంజయ్య, ఒల్లడపు అశోక్‌, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »