కామారెడ్డి, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
వరి ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని, రైతులకు సమస్యలు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున లింగంపేట్ మండలం కేంద్రం, మంగారం గ్రామం, నాగిరెడ్డి పేట్ మండలం తాండూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం ను పరిశీలించి కాంటా వేయాలని, బస్తాల్లో నింపిన ధాన్యం ను సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు.
రైతులకు సంబంధించిన వరి ధాన్యం సేకరణ, బ్యాంకు ఖాతా, తదితర వివరాలను ట్యాబ్ లో నమోదు చేయాలని అన్నారు. రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు జరిగేవిధంగా చూడాలని అన్నారు. అనంతరం లింగం పేట్ బావిని కలెక్టర్ పరిశీలించి, టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని, కాటేజ్ లు ఏర్పాటుకు ప్రతిపాద్దించాలని అన్నారు. బావిలో ఉన్న చెత్తను తొలగించాలని, సమీపంలో మొక్కలు నాటి సంరాక్షించాలని అన్నారు.
నాగన్న బావి చూడడానికి వచ్చిన పాఠశాల చిన్నారులతో మాట్లాడుతూ, పురాతన బావి గురించి తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహ రావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్, స్థానిక తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.