ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

భీంగల్‌ మండలం బడా భీంగల్‌, చెంగల్‌, బాబాపూర్‌, పల్లికొండ తదితర గ్రామాలలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు.

రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి, లారీలలో లోడ్‌ చేసి నిర్దేశిత రైస్‌ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్‌ లోడిరగ్‌ వెంటదివెంట జరిగేలా పర్యవేక్షణ జరపాలన్నారు. అదనపు కలెక్టర్‌ వెంట డీఆర్డీఓ సాయాగౌడ్‌ తదితరులు ఉన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »