డిచ్‌పల్లి, నవంబర్ 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మరియు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఒక్కరోజు అవగాహన సదస్సు అప్లైడ్ స్టాటిస్టిక్స్ విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహించారు. సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ -ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ, స్టాటిష్టిక్స్ అనుకరణ మరియు ప్రాముఖ్యతను గురించి వివరించారు.
స్టాటిష్టిక్స్ నూతన ఆవిష్కరణలో కీలక పాత్ర పోషిస్తూ సమాజంలో అన్ని శాస్త్రాలను ప్రభావితం చేస్తుందన్నారు. గణాంక శాస్త్ర భావనలు ప్రధానంగా శాస్త్ర సాంకేతిక మరియు ప్రసార రంగాన్ని బలోపేతం చేసి సమాజ పురోభివృద్ధికి దారి చూపి నాయన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి మాట్లాడుతూ పరిశోధనలు సాంఖ్యాక శాస్త్రం ఆవశ్యకతను తెలిపారు.
తెలంగాణ వర్సిటీ కో- ఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ మాట్లాడుతూ సాంఖ్యక శాస్త్రంతో వివిధ శాస్త్రాల అనువర్తన ను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్త అప్లైడ్ స్టాటిస్టిక్స్ విభాగాదిపతి ఆచార్య కె సంపత్ కుమార్ మాట్లాడుతూ కార్యక్రమం విశిష్టతను వివరించారు. సెమినార్లో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొని పలు రకాల పోటీలను నిర్వహించారు.
పోస్టర్ ప్రజెంటేషన్లో, క్విజ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ, సైన్స్ డీన్, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ ఆరతి, సాంఖ్యక శాస్త్ర గొప్పతనాన్ని విద్యార్థినీ విద్యార్థులు తెలుసుకోవాలని తెలిపారు. గణిత శాస్త్ర కాంటాక్ట్ అధ్యాపకులు డాక్టర్ పురుషోత్తం, రాజేశ్వర్, నర్సింలు, సందీప్ మరియు వివిధ కళాశాలల అధ్యాపకులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.