హైదరాబాద్, నవంబర్ 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తేది: 06.11.2024 తెలంగాణ రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రారంభం అయ్యింది. తెలంగాణకు చెందిన సుమారు 15 లక్షల మంది ప్రవాసి కార్మికులు గల్ఫ్ తదితర దేశాలలో నివసిస్తున్నట్లు ఒక అంచనా. ఈ సర్వేతో ఖచ్చితమైన గల్ఫ్ కార్మికుల సంఖ్య ఎంతో తేలిపోతుంది.
విదేశాలకు వలస వెళ్లారని చెబితే… రేషన్ కార్డుల్లో పేర్లు తీసేస్తారా?
రైతు బంధు, రైతు బీమా వర్తించదా? ఇతర సంక్షేమ పథకాలు వర్తించవా? అనే సందేహాలు ఉన్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఒక సామాజిక ఆశయంతో సర్వే నిర్వహిస్తోంది. ఆ సర్వే ముందుకు సాగకుండా కొంతమంది దుష్ప్రచారానికి తెరలేపారు. ఒక్క విషయం వెరీ క్లియర్… ఈ సర్వేతో రేషన్ కార్డులు తొలగించడాలు, పథకాల నుంచి తొలగించడాలు ఉండవు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
సర్వే ప్రశ్న నెం. 48 లో వలస వివరాలు అడిగారు. మీ కుటుంబం నుండి వలస వెళ్ళారా? ఇతర దేశాలు అయితే దేశం పేరు, ఇతర రాష్ట్రాలు అయితే రాష్ట్రం పేరు, వలస వెళ్లడానికి కారణం అనే ప్రశ్నలున్నాయి.
విఫలమైన కేసీఆర్ ప్రభుత్వం…
టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 ఆగస్టు 19న నిర్వహించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ లో విభాగం-సి, కాలం నెం.17 లో వలస కూలీలు, ప్రవాసీల ప్రస్తావన ఉన్నది. 9 వ కోడ్ ను ఎంపిక చేస్తే ‘విదేశాలలో పనిచేస్తున్నారు’ అని నమోదయ్యేలా ప్రశ్నావళిని రూపొందించారు. ఈ విధంగా సేకరించిన గల్ఫ్ కార్మికుల సమాచారాన్ని కేసీఆర్ ప్రభుత్వం బయటపెట్టలేదు. సమాచార హక్కు చట్టం కింద అడిగినా ఇవ్వలేదు.