ధాన్యం కొనుగోళ్లలో కామారెడ్డిది రెండవ స్థానం

కామారెడ్డి, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

తెలంగాణ రాష్ట్రంలో పండిరచే బియ్యానికి మంచి పేరుందని, ఆ బియ్యం రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి డి.ఎస్‌. చౌహాన్‌ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో రైస్‌ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

మిల్లర్లకు వారి గత సి.ఏం.ఆర్‌. పనితీరును బట్టి పారదర్శకంగా ధాన్యం కేటాయించడం జరుగుతుందని తెలిపారు. మిల్లర్లు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోకూడదని తెలిపారు. మిల్లర్ల సహకారంతో ధాన్యం సేకరైంచడం మిల్లింగ్‌ చేయడం జరుగుతున్నదని తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని, అదేవిధంగా ధాన్యాన్ని శుభ్రపరచి తేవాలని అన్నారు. పంట పూర్తిగా పండి కోతకు ఆస్కారం ఉన్నపుడే కోయాలని తెలిపారు. పచ్చిగా ఉన్నపుడు కోయడం మంచిది కాదని అన్నారు. ఆరబెట్టి తీసుకవచ్చిన ధాన్యాన్ని మంచి మద్దతు ధర కల్పించడం జరుగుతుందని, ఎలాంటి కోతలు చేయబడవని తెలిపారు.

పచ్చిపంట కోయడం నేరమని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయడం జరుగుతున్నదని తెలిపారు. రైతుల వద్దకే ప్రభుత్వ యంత్రాంగం వస్తున్నాదని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ఉద్దేశం అని అన్నారు. అధికారులు నీతి నిజాయితీగా పనిచేయడం ద్వారా మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలను తీసుకువచ్చి కాంట అయిన మూడు, నాలుగు రోజుల్లోనే చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. నాణ్యమైన ధాన్యం ప్రతీ బస్తాలో 40.650 కిలోలుగా తూకం వేయడం జరుగుతుందని, రైతులు ఈ విషయాన్ని గ్రహించాలి తెలిపారు.

జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ మాట్లాడుతూ, జిల్లాలో 423 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, సన్నరకం వడ్లు కొనుగోలుకు అవసరమైన చోట ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 51,480 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచామని తెలిపారు. రైస్‌ మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీ పత్రాలు అందజేశారని, గోనె సంచులు సమస్యలు లేవని తెలిపారు.

అవసరమైన ఇంటర్మీడియట్‌ గోదాంలు అందుబాటులో ఉన్నాయని, ధాన్యం మిల్లులకు రవాణా చేసేందుకు 10 ట్రాన్స్‌ పోర్టర్లను ఏర్పాటుచేసుకోవడం జరిగిందని తెలిపారు.కొనుగోలు కేంద్రాల ఇంచార్జిలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. జిల్లాలోని రాష్ట్రంలోనే రోల్‌ మాడల్‌ గా తీసుకువస్తామని తెలిపారు. ట్యాబ్‌ ఎంట్రీలు త్వరగా చేసేందుకు సంబంధిత వారికి తెలియపరుస్తామని అన్నారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుపుటకు టోల్‌ ఫ్రీ ఏర్పాటుచేయడం జరిగిందని, టోల్‌ ఫ్రీ లో వచ్చిన సమస్యలకు ఎప్పటికప్పుడు సమాధానాలు అందిస్తున్నామని తెలిపారు.

ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ, జిల్లాలో ఇంటర్‌ చెక్‌ పోస్టులు ఏర్పాటుచేయడం జరిగిందని, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుండి అక్రమ రవాణా అరికట్టేందుకు నిఘా పెట్టామని తెలిపారు. జిల్లా లోని రైస్‌ మిల్లర్లు మాట్లాడుతూ, రైతులను కాపాడుతూ, మరోప్రక్క ఇండస్ట్రీని కాపాడుకుంటున్నమని తెలిపారు. జిల్లాను రోల్‌ మోడల్‌ గా చేస్తామని అన్నారు. ధాన్యం నిల్వకోసం అవసరమైన గోదాములు, స్థలం ఉందని తెలిపారు.

అనంతరం సదాశివనగర్‌ లోని కొనుగోలు కేంద్రాన్ని, బిక్నూర్‌ మండలం జంగంపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ , అధికారులతో కలిసి సందర్శించారు. ఆయా కేంద్రాల్లో తిరిగి వరి ధాన్యం తేమశాతం కొలిచి, సంబంధిత రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు ధాన్యం పంటను ఆర బెట్టుకుని కేంద్రాలకు తీసుకువచ్చి, మంచి ధరను పొందాలని తెలిపారు. పచ్చి పంటను కోయవద్దని తెలిపారు.

కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌ రెడ్డి, వి.విక్టర్‌, ఆర్డీఓ రంగనాథ్‌ రావు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ రాజేందర్‌, ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహ రావు, జిల్లా సహకార అధికారి రాం మోహన్‌, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారిని రమ్య, రైస్‌ మిల్లర్లు, ఆయా కేంద్రాల ఇంచార్జీలు, రైతులు, పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »