కామారెడ్డి, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 341 మందికి 3 కోట్ల 41 లక్షల 39 వేల 556 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారాక్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 5,196 మందికి 51 కోట్ల 62 లక్షల 70 వేల 416 రూపాయల కల్యాణలక్ష్మి, షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడపిల్లను మగ పిల్లవానితో సమానంగా పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.