కామారెడ్డి, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా, పక్కాగా ప్రతీ ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియా కాలనీలో ఇంటింటి సమగ్ర సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమాచార సేకరణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రశ్నావళి లోని ప్రతీ అంశం ప్రతీ ఒక్కరి పేరుతో పాటు సమాచారాన్ని సేకరించాలని తెలిపారు.
ప్రశ్నావళిలో పేర్కొన్న అంశాలకు సంబంధించిన కోడ్ నెంబర్లు సరిగా నమోదు చేయాలనీ అన్నారు. హౌస్ లిస్టింగ్ సమయంలో ఇంటికి అతికించిన స్టిక్కర్ ను కలెక్టర్ పరిశీలించారు. ప్రతీ రోజూ కనీసం 10 నుండి 15 ఇళ్ల సమాచారాన్ని సేకరించాలని ఎన్యుమరేటర్‌కు సూచించారు. సూపర్వైజర్ అధికారులు సర్వే తీరును పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.