బాన్సువాడ, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మలేషియాలో జరిగిన అంతర్జాతీయ ఐటీ సదస్సులో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతులమీదుగా ఐటి ఎక్యులెన్సీ అవార్డును బాన్సువాడ మండలంలోని చిన్న రాంపూర్ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త కురుమ మారుతి అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవార్డును రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా అందుకోవడం ఆనందంగా ఉందని, తాను పుట్టిన గడ్డకు సేవ చేయడంతో పాటు పారిశ్రామికంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.