పరీక్షలు సమన్వయంతో సజావుగా నిర్వహించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

గ్రూప్‌ -3 పరీక్షలను సమన్వయంతో, సజావుగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్స్‌, అబ్జర్వర్స్‌, ఐడెంటిఫికేషన్‌ ఆఫీసర్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, రూట్‌ ఆఫీసర్స్‌ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా సమన్వయంతో ఈ నెల 17,18 తేదీలలో నిర్వహించే గ్రూప్‌ -3 పరీక్షలను సజావుగా నిర్వహించాలని తెలిపారు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిబంధన ప్రకారం పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థుల బయో మెట్రిక్‌ అటెండెన్స్‌ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2 గంటలకు తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌, రీజనల్‌ కో ఆర్డినేటర్‌ విజయ్‌ కుమార్‌, ట్రైనర్‌ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »