కామరెడ్డి, నవంబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిపై చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలపై సమర్పించిన అర్జీలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రజావాణిలో (66) అర్జీలు రావడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సిఈఓ చందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.