ఎల్లారెడ్డి, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజా ఆరోగ్యానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు మండలంలోని మత్తమాల్, రుద్రారం, అన్నాసాగర్ గ్రామాలలో బాధిత కుటుంబాలకు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు వైద్యానికి ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించడమే కాకుండా ప్రజలను ఆరోగ్యవంతులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు. ఆసుపత్రిలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వెంటనే ఆసుపత్రిలో తమ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, మార్కెట్ కమిటీ చైర్మన్ మరెడ్డి రజిత వెంకట్రామ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంతోష్, మాజీ ఎంపీటీసీ గురు ప్రతాప్, ఎఎంసి డైరెక్టర్ గంగా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసిలు ఉషా గౌడ్, సామెల్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పద్మారావు, దుర్గ రెడ్డి, రుక్మ రెడ్డి, సాయిలు, గర్గుల రాజు,పెంట రెడ్డి, సాయిబాబా ఆశ మొల్ల, సాయిబాబా గౌడ్, పెద్దబోయినరాజయ్య, సాయిబాబా, యాదయ్య, చిత్తరంజన్, బాబా, సాల్మన్,మహిపాల్, బాగేశ్ గ్రామస్తులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.