నాణ్యమైన చికిత్స అందించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

రైతులు పండిరచిన వరి ధాన్యంను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం దోమకొండ మండలం అంచనూర్‌ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, సబ్‌ సెంటర్‌, సమగ్ర కుటుంబ సర్వే తీరును కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం ను ప్రతీ రైతు నుండి కొనుగోలు చేయాలనీ, ధాన్యం తేమ శాతం పరిశీలించాలని సూచించారు.

నాణ్యమైన చికిత్సలు అందించాలని వైద్యులకు తెలిపారు. అనంతరం సమగ్ర ఇంటింటి సర్వే తీరును పరిశీలించి ప్రతీ యొక్క కుటుంబంలోని వ్యక్తుల వివరాలను సేకరించి పక్కాగా నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్‌, సంజయ్‌ రావు, మండల ప్రత్యేక అధికారిని జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాపారాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »