కామారెడ్డి, నవంబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా మంగళవారం రోజున స్థానిక కళాభారతి లో రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారు అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పథకాల పై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాదని తెలిపారు.
మహిళాశక్తీ కార్యక్రమం క్రింద మైక్రో ఎంటర్ ప్రైసెస్, పాడి పరిశ్రమ, క్యాంటీన్ లో నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుచున్నదని తెలిపారు. జిల్లాలో 423 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల సంక్షేమం కోసం పండిరచిన వరి ధాన్యం ను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తున్నదని , సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వడం జరుగుచిన్నదని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా అంతడుపుల నాగరాజు బృందం చే కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.
జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూ.లకే వంటగ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణ మాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నాదని తెలిపారు. అనంతరం అంతడుపుల నాగరాజు కళా బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
తెలంగాణ పోరాట యోధులు, పోతారాజులు, బతుకమ్మ వంటి వాటిపై నృత్య ప్రదర్శనలు, ప్రజా ప్రభుత్వం పిలిచింది, ప్రజా పాలన వచ్చింది అనే అంశాలపై నాటికలను సుమారు 75 మంది కళాకారులు ప్రదర్శించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ రంగనాథ్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళలు, పాఠశాల విద్యార్థినులు , తదితరులు పాల్గొన్నారు.