వేల్పూర్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలోని అన్ని వాడల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ కార్యదర్శి స్నేహ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు ప్రతి ఇంటి యజమానికి మొక్కలపై అవగాహన కల్పిస్తూ గ్రామంలోని అన్ని కాలనీలలో ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి మొక్క ఎదిగే వరకు ఇంటి యజమాని పూర్తి బాధ్యత తీసుకోవాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలోని దేవాలయాలలో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో చెరువు ఒడ్డున పంట పొలాల గట్లపైన మొక్కలు నాటడం జరుగుతుందని గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గ్రామంలో నాటిన మొక్కలను పరిశీలించడం జరుగుతుందని పల్లె ప్రగతి ప్రకృతి వనం స్మశాన వాటికలలో నాటిన మొక్కలను కూడా పాలకవర్గంతో కలిసి పరిశీలిస్తున్నట్లు తెలిపారు.