చిత్తశుద్దితో విధులు నిర్వర్తించాలి…

నిజామాబాద్‌, నవంబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

ప్రజల సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల స్థితిగతులను విశ్లేషించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి సమగ్ర సర్వే సందర్భంగా సేకరించిన వివరాలను ఆన్లైన్‌ లో నిక్షిప్తం చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. నందిపేట మండల పరిషత్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ శుక్రవారం సందర్శించి, ఇంటింటి సర్వే ద్వారా సేకరించిన వివరాలను ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు.

ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలకు ఆస్కారం లేకుండా చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆన్లైన్లో వివరాలు నమోదు సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురైనా, సాంకేతికపరమైన సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే, వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ ఆర్డీఓ రాజాగౌడ్‌, స్థానిక అధికారులు ఉన్నారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »