కామారెడ్డి, నవంబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ వి.విక్టర్ అన్నారు. శుక్రవారం తాడ్వాయి జిల్లా పరిషత్ హైస్కూల్ ను ఆయన సందర్శించారు. మధ్యాహ్నం భోజన పథకం క్రింద విద్యార్థులకు అందించే భోజనం శుభ్రంగా, నాణ్యతగా, రుచికరమైన భోజనం పెట్టాలని అన్నారు. బియ్యం, పప్పులు, కూరగాయలు ఒకటికి రెండు సార్లు కడగాలని తెలిపారు.
వంట వండే సమయంలో ఏమైనా అందులో పడకుండా ఎప్పటికప్పుడు మూతలు పెట్టాలని, వంట తయారు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వంటలు తయారు చేసే కుక్లకు తెలిపారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకొని తయారుచేసే వంటకాలలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
విద్యార్థులకు భోజనం అందించే సమయానికి ముందు వార్డెన్ ఆ వంటకాన్ని రుచి చూడాలని తెలిపారు. ఆయన వెంట హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ఉన్నారు.