ఎల్లారెడ్డి, జూలై 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిత్తశుద్ధితో తెలంగాణ రాష్ట్రాభివృద్ధికై నిరంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రమిస్తున్నారని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఎల్లారెడ్డి నియోజక వర్గం ఎల్లారెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన ఫుడ్ సెక్యూరిటి కార్డులను 2 వేల 73 మంది లబ్దిదారులకు పంపిణీ ఎంపి బిబి పాటిల్‌తో కలిసి పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఎల్లారెడ్డి మునిసిపల్ చైర్మన్ సత్యనారాయణ, అన్ని మండల జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్, సొసైటీ చైర్మన్లు, మండల తెరాస పార్టీ అధ్యక్షులు, రైతు బంధు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.