మాక్లూర్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
అమ్మ ఆదర్శ పాఠశాల ఆయా గ్రామాల్లో పనులను ఎంపీడీవో ట్రైనీ కలెక్టర్ సంకిత్ కుమార్ పరిశీలించారు, పూర్తికాని పాఠశాలలపై తక్షణమే పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
మాక్లూర్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఎంపీడీవో ట్రైని కలెక్టర్ కలెక్టర్ సంకిత్ కుమార్ అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను వేగవంతం చేయాలని పంచాయత్ రాజ్ ఏఈ శ్రీనివాస్. సూర్య సాయికు సూచించారు.
పాఠశాలలో తాగునీటి నీటి వసతి సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ ఏఈ నిర్లక్ష్యం కారణంగానే పనులు వేగవంతం జరగలేదని ఏఈ శ్రీనివాస్‌పై మండిపడ్డాడు. తక్షణమే పనులు వేగవంతం అయ్యేవిధంగా కాంట్రాక్టర్లను హెచ్చరించాడు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహించినప్పుడు పనులను వేగవంతం చేసే బాధ్యత అధికారులకు లేదా అని అధికారులపై గరం గరమయ్యారు.
నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పదని హెచ్చరించాడు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ సూర్య సాయి, శ్రీనివాస్ కాంట్రాక్టర్లు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అధికారులు పాల్గొన్నారు.