నిజామాబాద్, నవంబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా సమీకృత కార్యాలయము సముదాయములోని డిఆర్డిఏ కార్యాలయంలో శనివారం జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిఆర్డిఓ సాయగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వం జిల్లా సమాఖ్య నూతన భవన నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన జిల్లా సమాఖ్య భవన నిర్మాణానికి ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సంధర్భంగా తమకు నూతన భవన నిర్మాణం కొరకు స్థలము మరియు నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి, మంత్రి సీతక్కకి మరియు జిల్లా కలెక్టర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
డిఆర్డివో మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంఘాల్లో లేని వారిని సంఘాల్లో చేర్పించాలని తెలిపారు. కార్యక్రమంలో సంస్థాగత నిర్మాణము, బ్యాంకు లింకేజీ, శ్రీనిధి, ఫామ్, నాన్ ఫామ్ మండల సమాఖ్య మారు గ్రామ సమస్యల ఆడిట్ మొదలగు విషయాలపై చర్చించారు. కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సాయి గౌడ్, ఎస్ఇపి అధికారి భారతి, డిపిఎంలు సంధ్యారాణి, సాయిలు, శ్రీనివాస్, మారుతి, శ్రీనిధి ఆర్.ఎం రాందాస్, ఏ.పి.ఎం సరోజిని, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధ, కార్యదర్శి లావణ్య, కోశాధికారి లక్ష్మి, 28 మండల సమాఖ్యల అధ్యక్షులు పాల్గొన్నారు.