కామారెడ్డి, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని మోదీ అందిస్తున్న కోవిడ్ ఉచిత వాక్సినేషన్‌ను సందర్శించి వైద్యులతో వ్యాక్సినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ కరోనా రాకుండా కాపాడే రక్షణ కవచం అని, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ ఉచితంగా టీకా అందజేస్తున్నారన్నారు.
18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నియోజకవర్గ పరిధిలో ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద మోదీ చిత్ర పటంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కు ధరించి, సామాజిక దూరం పాటించాలని అన్నారు. వ్యాక్సిన్ కూడా ఒకటవ, రెండవ డోసులు తప్పనిసరిగా వేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా తీవ్రత తగ్గుతుందన్నారు.