సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జూలై 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని 25 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 22 లక్షల 16 వేల రూపాయల చెక్కులను, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన అల్లే బాల్‌రాజు, రామారెడ్డి మండలం మద్ది కుంట గ్రామానికి చెందిన రేకులపల్లి మహిపాల్‌ రెడ్డిలు ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి నామినీలు అల్లే సావిత్రి, రెకులపల్లి యశోదలకు 2 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 828 మందికి 5 కోట్ల 7 లక్షల 62 వేల 900 రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలకు గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఖర్చయిన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు, పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని మరోవైపు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Check Also

కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లను తనిఖీ చేసిన కలెక్టర్‌

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »