బాన్సువాడ, నవంబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కొల్లూరు నాగారం గ్రామాల్లో నూతనంగా నిర్మించే మెటల్ రోడ్డుకు శంకుస్థాపన, 50 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, 40 లక్షలతో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రైతులు పండిరచిన సన్న రకం దాన్యానికి 500 రూపాయల బోనస్ దేశంలో ఏ రాష్ట్రం అందించని సాయాన్ని ప్రభుత్వం అందించిందన్నారు. నియోజకవర్గంలో పేద ప్రజల సౌకర్యార్థం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 120 కళ్యాణ మండపాలను నిర్మించడం జరిగిందన్నారు. కొల్లూరు గ్రామం కుల మతాలకు అతీతంగా ఐక్యతగా ఉంటూ వస్తుందని ఇటీవల కొందరు కుట్ర దారులు గ్రామంలో చిచ్చు పెడుతూ వర్గాలుగా విభజిస్తున్నారని గ్రామస్తులు ఐక్యతతో ఉండి అభివృద్ధికి సహకరించాలన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తహసిల్దార్ వరప్రసాద్,నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్తా, నాయకులు దొడ్ల వెంకటరామిరెడ్డి,పిట్ల శ్రీధర్, గంగుల గంగారం, ఎజాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాచాప్ప, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.