వేల్పూర్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వేల్పూరు మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద తహసిల్దార్ సతీష్ రెడ్డి అధ్యక్షతన నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్, ఎంపీపీ జమున మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలానికి నూతనంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేయడం జరిగిందని తెలిపారు.
సీఎం కెసిఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా ఎప్పటికీ ఉంటుందని వారన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి భారతి, ఆర్టిఏ మెంబర్ రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్న రెడ్డి, వైస్ ఎంపీపీ సురేష్, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.