డిచ్‌పల్లి, నవంబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతం ప్రారంభమయ్యాయి
తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్) బి.ఎ./ బీ.కాం./ బీ.ఎస్సీ./ బిబిఏ./ బీసీఏ కోర్సులకు ఒకటవ, మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యులర్‌కు, రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు.
ఉదయం జరిగిన పరిక్ష కేంద్రాలలో 7 వేల 748 మంది విద్యార్థులకు 7 వేల 147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 601 మంది విద్యార్థులు గైరాజరైనట్టు పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 6 వేల 564 మంది విద్యార్థులకు గాను 5 వేల 989 హాజరయ్యారని 572 మంది విద్యార్థులు గైరాజరయ్యారన్నారు.
మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను గుర్తించామని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ వివరించారు.