ఆర్మూర్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా దళిత మోర్చా ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు పులి యుగంధర్ ఆధ్వర్యంలో డప్పు కొట్టే వారికి, చెప్పులు కుట్టే మోచీ వారికి, కాటికాపరి వారికి నెల-నెలా 5 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఎంఆర్‌ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, దళిత మోర్చా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ నల్ల రాజారాం, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి మాట్లాడారు.
భారతీయ జనతా దళిత మోర్చా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు డప్పు కొట్టే వారికి, చెప్పులు కుట్టే మోచీ వారికి, అదేవిధంగా కాటికాపరులకు ప్రతి నెల ఐదు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇవ్వాలని, కరోణ కాలంలో వీరి కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాయని, కరోణ కారణంగా లాక్ డౌన్ ఏర్పాటుతో చెప్పులు కుట్టే వారికి జీవనోపాధి, డప్పులు కొట్టే వారికి జీవనోపాధి, అదేవిధంగా కాటికాపరిలకు సైతం సరైనటువంటి జీవనోపాధి లభించక వారు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని బతుకు జీవితాన్ని గడుపుతున్నారని, కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి ప్రతినెల 5000 రూపాయల పెన్షన్‌ను వెంటనే అమలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ మండల అధ్యక్షులు రోహిత్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానంద్, బీజేపీ సీనియర్ నాయకులు ద్యాగ ఉదయ్, కౌన్సిలర్ బ్యావత్ సాయికుమార్, దళిత మోర్చా ఆర్మూరు మండల అధ్యక్షులు ఆలూరు సుభాష్, ప్రధాన కార్యదర్శి ముఖేష్, బిజెపి ఆర్మూర్ మండల ఉపాధ్యక్షులు రాజేందర్, దళిత మోర్చా ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు బ్యావత్ ప్రవీణ్, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పీర్ సింగ్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, బీజేవైఎం ఆర్మూరు మండల అధ్యక్షులు నరేష్ చారి, డప్పులు కొట్టు వారు, చెప్పులు కుట్టే మోచీలు, కాటికాపరులు పాల్గొన్నారు.