కామారెడ్డి, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీ (62) మహిళకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు, రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ ప్రభుత్వ ఉపాధ్యాయులు జమీల్ 27వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులను నిర్వహించడమే కాకుండా సామాజిక సేవలో భాగంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలకు సహాయ సహకారాలను అందిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు జమీల్ సేవలు అభినందనీయమని వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది ప్రభుత్వ ఉద్యోగులు రక్తదానానికి ముందుకు రావాలని, 27వ సారి రక్తదానం చేసినందుకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు డాక్టర్ పుట్ల అనిల్ కుమార్, సలహాదారులు వెంకటరమణ పాల్గొన్నారు.