బాన్సువాడ, నవంబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం మండల న్యాయ సేవ అధికారిక సంస్థ, యువర్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి మాట్లాడుతూ విద్యార్థినిలు చిన్ననాటి నుండే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
బాల్యవివాహాలు, బాలికలు , మహిళలపై లైంగిక వేధింపులు జరిపే వారిపై చట్టం కఠినంగా ఉందన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని సమాజంలో ఉన్నత స్థానానికి ఎదిగేలా లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఎస్సై మోహన్,యువర్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు సచిన్ యాదవ్, వేద ప్రకాష్, నవీన్, అఖిలేష్ గౌడ్,విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.