మూడు లక్షల 9 వేల కొత్త రేషన్‌ కార్డులు

బాల్కొండ, జూలై 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఇప్పటికే 87 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో మూడు లక్షల 9 వేల మందికి కార్డు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

బాల్కొండలోని మున్నూరు కాపు సంఘం భవనంలో సోమవారం కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం 87లక్షల రేషన్‌ కార్డులు ఉన్నవని, కొత్త కార్డులు కోసం నాలుగు లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3 లక్షల 9 వేల మందికి కొత్త కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వాటిని సోమవారం ఆయా నియోజకవర్గాల్లో పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

90 లక్షల రేషన్‌ కార్డుల ద్వారా రెండు కోట్ల 90 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఉంటే 70 శాతం మందికి కార్డులు ఉన్నవని, నిజామాబాద్‌ జిల్లాలో మూడు లక్షల 90 వేల కార్డులు ఇంతకు ముందు ఉంటే కొత్తగా 16 వేలు మంజూరు చేయడంతో అవి నాలుగు లక్షల ఆరు వేల కార్డులు అయినవని పేర్కొన్నారు.

పన్నెండు లక్షల మందికి కార్డుల ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 71 వేల 221 కార్డులు ఉంటే 3 వేల 634 కొత్త వాటితో 74 వేల 855 కార్డులు అయినవి మొత్తం నియోజకవర్గంలో మూడు లక్షల మందికి గాను రెండున్నర లక్షల మందికి కార్డు ద్వారా లాభం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 90 వేల కుటుంబాలు గాను 74 వేల కుటుంబాలకు కార్డులు ఇస్తున్నామన్నారు. కార్డుల ద్వారా మార్కెట్లో 28 రూపాయల ధర ఉన్న బియ్యాన్ని ప్రభుత్వం 27 రూపాయలు వెచ్చించి కిలో బియ్యం ఒక రూపాయికే అందిస్తుందన్నారు.

అంతే కాదు అనేక రకాల కార్యక్రమాలు పేదలకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని 70 సంవత్సరాలలో జరగనటువంటి కార్యక్రమాలు దేశంలో 29 రాష్ట్రాలలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో ఈ పథకాలు లేవన్నారు. రేషన్‌ కార్డు ఉన్న పేద వారికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తున్నామన్నారు.

బాల్కొండలో ఫోర్‌ లైన్‌ రోడ్‌ డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌, తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించడం జరుగుతుందన్నారు. యాదవులకు, నాయి బ్రాహ్మణులకు. గంగపుత్రులకు , రజకులకు, వృద్ధులకు వికలాంగులకు ఆసరా పెన్షన్‌లు డెలివరీలు జరిగిన మహిళలకు కెసిఆర్‌ కిట్‌లు నగదు, పేదలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ తదితర ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామన్నారు.

దళితులకు దళిత బంధు కార్యక్రమం అమలు చేయనున్నామన్నారు. 57 సంవత్సరాల నిండిన వారికి ఆసరా పెన్షన్‌ కరోనా వల్ల ఆలస్యం అయిందని, వచ్చే నెల నుంచి ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజి గౌడ్‌. మార్కెట్‌ చైర్మన్‌ గంగారెడ్డి అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌, సర్పంచ్‌ బూస సునీత నరహరి, జడ్పిటిసి దాసరి లావణ్య, ఎంపీపీ లావణ్య, లింగం గౌడ్‌, డి.ఎస్‌.ఒ వెంకటేశ్వర్లు, డిఎం అభిషేక్‌ సింగ్‌, ఆర్‌డిఓ శ్రీనివాస్‌, ఎంపీడీవో సంతోష్‌ కుమార్‌, ప్రవీణ్‌ సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

డిగ్రీ కళాశాలలో యన్‌సిసి సంబరాలు

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »