కామారెడ్డి, డిసెంబరు 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమం లో భాగంగా జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో 2కె రన్ కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం నుండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వరకు నిర్వహించారు.
ఇందులో భాగంగా 2కె రన్ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి జగన్నాథం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎన్ఎస్ఎస్ సుధాకర్, అథ్లెటిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ సుమారుగా 200 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు.