కానిస్టేబుల్‌ కిష్టయ్య విగ్రహానికి నివాళులు

బాన్సువాడ, డిసెంబరు 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

బాన్సువాడ పట్టణంలో కానిస్టేబుల్‌ కిష్టయ్య వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆదివారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తుపాకితో కాల్చుకొని ఉద్యమానికి ఊపిరి పోసి అమరుడైన కానిస్టేబుల్‌ కిష్టయ్యను స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు.

ఈ సందర్భంగా ముదిరాజ్‌ మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షులు కాలేక్‌, నాయకులు అంజిరెడ్డి, ఏజస్‌, కౌన్సిలర్‌ లింగమేశ్వర్‌, రఘు,ముదిరాజ్‌ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 గురువారం, డిసెంబరు 5, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »