కామారెడ్డి, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈ నెల 5 న రాష్ట్ర ప్రోహిబిషన్ ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్ తో కలిసి మంత్రి పర్యటన ఏర్పాట్లు, ధాన్యం సేకరణ, సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్ ఎంట్రీ లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 5 వ తేదీన జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ లో యంగ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ శంకుస్థాపన, మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం, లింగంపెట్ నాగన్న బావి, కామారెడ్డి మున్సిపల్ లో త్రాగునీటి వసతుల కల్పన, తదితర కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారని తెలిపారు. అట్టి కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేసి ట్యాబ్ ఎంట్రీలు త్వరితగతిన చేయాలని, రైతులకు వెంటది వెంట చెల్లింపులు జరిగేలా త్వరితగతిన పూర్తి చేయాలని పౌర సరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ అన్నారు. ఇప్పటివరకు 83 శాతం ఆన్లైన్ నమోదు జరిగిందని, మిగతా నమోదు వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా సహకార అధికారి రాం మోహన్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్, సహాయ పౌర సరఫరాల అధికారి నరసింహారావు, సి. పి. ఒ. రాజారాం, జిల్లా విద్యా శాఖాధికారి రాజు, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, మున్సిపల్ డిప్యూటీ ఈ ఈ వేణు గోపాల్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.