కామారెడ్డి, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సందర్భంగా పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహిస్తున్న రంగోలి, మెగా వైద్యశిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. మంగళవారం కామారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో మహిళలకు నిర్వహిస్తున్న ముగ్గుల పోటీలను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం మున్సిపల్ కార్మికులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు,మున్సిపల్ చైర్ పర్సన్ ఇందు ప్రియ, మున్సిపల్ కమీషనర్ శ్రీహరి, డిప్యూటీ ఈఈ వేణు గోపాల్, కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.