నిజామాబాద్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన విభాగంలో అసోషియేట్ ప్రొఫెసర్ డా. వంగరి త్రివేణికి ‘‘వ్యాసరచన’’ విభాగంలో అమృతలత – అపురూప అవార్డును రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం ప్రదానం చేశారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమెల్సీ సురభి వాణిదేవీ, విశిష్ట అతిథిగా భాషా సాంస్క ృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. డా. త్రివేణి రచించిన పుప్పొడి, పుత్తడి, భవంతి, భరంతి, పొత్తిలి, భాషిక, అలుగు వంటి సాహిత్య వ్యాస సంపుటాలను రచించారు.
త్వరలో అలుగు, పొడుపు, భరణి, ప్రమిద వంటి సాహిత్య వ్యాస సంపుటాలను ప్రచురించబోతున్నారు. ఆమె చేస్తున్న సాహిత్య కృషికి గాను అవార్డు ప్రదానం చేసినట్లు అమృతలత తెలిపారు.
డాక్టర్ త్రివేణి అవార్డు సాధించడం పట్ల తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ప్రశంసించారు.