కామారెడ్డి, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మధుసూదన్ రెడ్డి (58) న్యూమోనియా వ్యాధితో నిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో వారికి అత్యవసరంగా ఓ నెగటివ్ రక్తం అవసరమని వైద్యులు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతొ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రక్తదాత వెంటనే స్పందించి హైదరాబాద్ వెళ్లి 58 వ సారి ఓ నెగటివ్ రక్తాన్ని సకాలంలో అందజేశారన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ రక్తదాత కిరణ్ గతంలో చాలా సందర్భాల్లో అనీమియా వ్యాధితో బాధపడుతున్న గర్భిణీ స్త్రీల కోసం, వివిధ ఆపరేషన్ల నిమిత్తమై, కరోనా సమయంలో కూడా రక్తాన్ని అందజేయడం జరిగిందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడమే కాకుండా డెంగ్యూ వ్యాధితో బాధపడే వారికి కావలసిన తెల్ల రక్త కణాలను సకాలంలో అందజేస్తూ మానవత్వాన్ని చాటడం జరుగుతుందని, యువత వీరిని స్ఫూర్తిగా తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలన్నారు.
సకాలంలో స్పందించి రక్తదానం చేసిన రక్తదాత కిరణ్‌కు ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అభినందనలు తెలిపారు.