బాన్సువాడ, డిసెంబరు 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళా సంఘ సభ్యులకు, వీధి వ్యాపారులకు రాష్ట్ర వ్యవసాయ సలాహదారు పోచారం, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది ఆయన సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని, సంక్షేమ పథకాలను మహిళలకు వివరించారు. అనంతరం మహిళా శక్తి క్యాంటీన్ లో స్థానిక నాయకులతో కలిసి భోజనం చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ గుప్త, నాయకులు అంజిరెడ్డి, అసద్ బిన్ మోసిన్, అజీమ్, అప్రోజ్, అమీర్ చావుస్, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.