మోర్తాడ్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. మోర్తాడ్ మండలంలోని పది గ్రామాలకు గాను మొత్తం 422 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మంజూరై వచ్చిన కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, స్థానిక మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, మోర్తాడ్ జడ్పిటిసి బద్దం రవి, స్థానిక సర్పంచ్ భోగ ధరణి ఆనంద్, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.