నిజామాబాద్, జూలై 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నల్గొండ జిల్లా హుజూర్‌నగర్‌లో రాజ్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులపై జరిగిన దాడి అమానుషమని దీనిని తీవ్రంగా ఖండిస్తూ ప్రింట్, ఎలక్ట్రానిక్, జిల్లా జర్నలిస్టులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ సంఘం జనరల్ సెక్రెటరీ, డి.యల్.యన్.చారి.మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా రాజ్ న్యూస్ ఛానల్ హుజూర్ నగర్‌లో చర్చ వేదిక నిర్వహించిందని, అయితే స్థానిక సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో కొందరు అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలు చర్చవేదిక మధ్యలో చొరబడి జర్నలిస్టులపై దాడులకు పాల్పడ్డారని, ఇలా జర్నలిస్టులపై భౌతికంగా దాడులు చేస్తూ కెమెరాలను ధ్వంసం చేయడం హేయమైన ఘటన అని, ప్రజాస్వామ్యంలో మీడియా తన పాత్ర బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తుండగా అధికార పార్టీ ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడటం హేయమైన చర్యగా భావిస్తూ తీవ్రంగా ఖండిరచారు.
చర్చావేదికలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. భౌతికంగా దాడులకు దిగడం సిగ్గుచేటని ఏదైనా తప్పులుంటే చర్చలో పాల్గొని చర్చించాల్సిన పార్టీలు ఇలాంటి దాడులకు దిగడం వల్ల ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంకేతాలు పంపుతున్నామో అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల గొంతుకైన మీడియాపై ఉక్కు పాదం మోపితే సహాంచేది లేదంటూ నినాదాలు చేశారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించిన రాజకీయ నాయకుల పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు సురేష్‌గౌడ్, ప్రసాద్, శ్రావణ్, రాజు, ప్రసాద్, చక్రధర్, ప్రవీణ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.