ఆర్మూర్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
ఈనెల 4న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సుద్ధపల్లి క్రీడామైదానంలో జరిగిన జిల్లా సీనియర్ బేస్ బాల్ ఎంపిక పోటీలలో షెడ్యూల్ కులాల అభివృద్ధి ఆర్మూర్ శాఖ హాస్టల్ విద్యార్థులు ఈ ప్రవళిక, జి జలజ లు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచారు.
ఈనెల 07 నుండి 09 వరకు జగిత్యాల జిల్లాలో జరిగే రాష్ట్ర బేస్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆర్మూర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ షబానా బేగం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర పోటీలకు తమ హాస్టల్ విద్యార్థులు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పనిసరి క్రీడలో పాల్గొనాలని అన్నారు.
కార్యక్రమంలో జడ్పిహెచ్‌ఎస్ బాయ్స్ ఆర్మూర్ ప్రధానోపాధ్యాయులు పుప్పాల లక్ష్మీనరసయ్య, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి బొజ్జ మల్లేష్ గౌడ్ మరియు జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సొప్పరి వినోద్ తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.