ఆర్మూర్, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
మానవ జీవన వికాసానికి చరిత్ర పుస్తకాలె ఆధారాలని రాష్ట్ర బి.సీ డెడికేటెడ్ చైర్మన్ రిటైర్డ్ ఐ.ఏ.ఏస్ అధికారి బుసని వెంకటేశ్వర రావు అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బి.సీ కులాల రాజకీయ స్థిగతులపై కుల సంఘాల వారి అభిప్రాయాలు సేకరించారు.
ఈ సందర్భంగా బాల్కొండ శ్రీ సోమ క్షత్రియ ‘‘నకాష్’’ బాల్కొండకు చెందిన బి.ఆర్.నర్సింగ్ రావు వ్రాసిన పుస్తకం ‘‘అల్ల కొండ ఊరు ఉద్భవం – ఐదు ఆలయాలకు ప్రసిద్ది’’ అనే పుస్తకాన్ని గురువారం ఆవిష్కరణ చేస్తూ ఈ పుస్తకం మాములు పుస్తకం కాదని విజ్ఞానగని అన్నారు. చరిత్ర కారులు అల్లకొండ చరిత్రతో పాటు శ్రీ సోమ / ఆర్య క్షత్రియుల పుట్టు పూర్వోత్తరాలు, పూర్వం పెళ్లి విధాన పద్ధతులపై సమాచారాన్ని ఇవ్వడం అభినందనీయమని అన్నారు.
దేశంలోనే రెండో రాజధాని బి.సీ ఆఫీసర్
పూర్వం అల్ల కొండ దేశంలోనే రెండో రాజధాని అని నిజామాబాద్ బి.సీ సంక్షేమ అధికారిని స్రవంతి అన్నారు. 1780- 1836 కాలంలో మద్రాసు సుప్రీంకోర్టు ప్లీడరు ఏనుగుల వీరస్వామి కాశీయాత్ర లో భాగంగా భారత పర్యటన చేస్తూ హైదరాబాద్ పట్టణం నుండి బిక్కవోలు, రతాల రామారెడ్డి, నుండి డిచ్చిపల్లి, ఆరమూరు నుండి అల్లకొండ వరకు పాద యాత్రగా వచ్చి బాల్కొండలో 1830 లో జూన్ 26 నుండి 29 వరకు విడిది చేసినట్లు ఆయన వ్రాసుకున్న ‘‘కాశీయాత్ర అనుభవాలూ – ఏనుగుల వీర స్వామి’’ డైరీ ద్వారా తెలిసింది.
ఇదే విషయాన్ని బాల్కొండ శ్రీ సోమ క్షత్రియ ‘‘నకాష్’’ బాల్కొండకు చెందిన బి.ఆర్.నర్సింగ్ రావు వ్రాసిన పుస్తకం ‘‘అల్ల కొండ ఊరు ఉద్భవం – ఐదు ఆలయాలకు ప్రసిద్ది’’ అనే పుస్తకంలో వివరిం చారని ఆమె వివరించారు.
పైగా పుస్తకంలో అల్లకొండ రాజ్యం ఒక వ్యాపార కేంద్రంగా ఇక్కడ పండిరచినటువంటి పంటలు కూరగాయలు ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యేవని ఆమె వివరించారు.(09) కొండల చేత చుట్టబడినటు వంటి అల్లకొండ ఖిల్లా లోని నిర్మాణము ఆనాటి కట్టడాల నిర్మాణ శైలి మహా అద్భుతం, చెప్పవచ్చు. సింహద్వారాలు (కమాన్)అట్టి సింహద్వారాలు, అల నాటి కట్టడాల నేటి సమాజానికి తరానికి సాక్ష్యాలు.
పైగా రాజుల పాలనలో రాజ్యాన్ని కాపాడు కొనేందుకు ‘‘అబ్బురపరిచే మూడంచెల వ్యవస్థ’’తో పాటు రాజ్యంలో అన్ని వృత్తుల వారితో పాటు కవులు కళాకారులని పోషిచేవారట,ఆ రోజుల్లో అన్ని మతాలవారు ఐక్యమత్యంగా ఉంటూ ప్రజా క్షేమ పరిపాలన సాగించిన సందర్భాలు మనకు ఈ పుస్తకం ద్వారా తెలుస్తుందని ఆమె వివరించారు.