బాన్సువాడ, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సైన్స్, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈఓ రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు.
వైజ్ఞానిక ప్రదర్శనలో 23 మండలాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు సుమారు 400 ప్రదర్శనలు చేయనున్నట్లు, సైన్స్ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు.. కార్యక్రమంలో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ ఎంఈఓలు నాగేశ్వరరావు, చందర్, వెంకన్న, పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు కుశాల్, తపస్ జిల్లా కార్యదర్శి సంతోష్, నరహరి, తదితరులు పాల్గొన్నారు.