కామారెడ్డి, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ఋణాలు లక్ష్యనుకనుగుణంగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో, రెండవ త్రైమాసిక బ్యాంకర్ల జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక, మొలికసదుపాయాల ఋణాలు, ఏం.ఎస్.ఏం.ఈ., విద్యా ఋణాలు, గృహ రుణాలు, స్వయం సహాయక బృందాలకు ఋణాలు, ఇతర ప్రాధాన్యత పథకాలకు సంబంధించిన వాటిపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెండవ త్రైమాసికంలో సాధించిన ప్రగతి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సాధించవలసిన ప్రగతి లపై సమావేశంలో చర్చించడం జరిగిందని తెలిపారు. వార్షిక క్రెడిట్ ప్లాన్ 4695 కోట్లు కాగా సెప్టెంబర్ మాసాంతం వరకు 2030 కోట్లు ఋణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నిర్ణయించిన ప్రగతి సాధించాలని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, నాబార్డ్ డి. డి.ఏం. ప్రవీణ్, భారత రిజర్వ్ బ్యాంక్ ఏ.జి.ఏం. రహమాన్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రవికాంత్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, వివిధ శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.