కామారెడ్డి, డిసెంబరు 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :
సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ లో వార్డ్ నెంబర్లను సరిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ నుండి ఎంపీడీఓ లు, తహసీల్దార్లు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల సమగ్ర కుటుంబ సర్వే డేటాఎంట్రీలో వార్డ్ నెంబర్లను తప్పుగా నమోదు చేయడం జరిగినట్లు గుర్తించడం జరిగిందని, ఓటరు జాబితా ప్రకారం ఇంటి నెంబర్‌ల ప్రకారం వార్డ్ నెంబర్ వేయడాన్ని త్వరగా సరిచేసుకొని, సాఫ్టువేర్ అందుబాటులోకి రాగానే సరిచేయాలని తెలిపారు.
ఇందుకు పంచాయతీ సిబ్బంది సిద్ధంగా ఉండాలని, వార్డ్ నెంబర్లను సరిచేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ వార్డ్ లోని నెంబర్లను కూడా సరిచేసుకోవాలని అన్నారు. గ్రాడ్యుయేట్, టీచర్ల నియోజక వర్గంలోని పెండిరగులో ఉన్న దరఖాస్తులను పరిశీలించి ప్రాసెస్ చేయాలని తహసీల్దార్లు, ఈఆర్ఓ లను కలెక్టర్ ఆదేశించారు.
ఎస్‌ఎస్‌ఆర్ క్రింద ఫారం 6,7,8, లు లాగిన్ లో ఉన్న వాటిని తహసీల్దార్లు, ఆర్డిఒ లు ఆయా ఫారాలను ప్రాసెస్ చేయాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, సీపీఒ రాజారాం, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.